మాస్ మహారాజ్ కోసం రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి.!

Published on Apr 1, 2022 9:46 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో అయితే తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే సాలిడ్ హైప్ ని నమోదు చేసుకుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తుండగా ఇప్పుడు మేకర్స్ అయితే ఒక మెగా మాస్ అప్డేట్ ని రివీల్ చేశారు.

రేపు ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని మరియు ముహుర్తాన్ని ఫిక్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా ప్రారంభ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నట్టు ఇప్పుడు రివీల్ చేశారు. దీనితో చిత్ర యూనిట్ కూడా ఈ మెగా అనౌన్సమెంట్ ని ఎంతో గౌరవంగా అనౌన్స్ చేసి మెగాస్టార్ కి వెల్కమ్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :