మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన ఫ్యాన్ దర్శకుడు బాబీ కొల్లి చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. చిరు తన 158వ సినిమాగా చేయనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్కేల్ పరంగా అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం మెగాస్టార్ ఇప్పుడు ఊహించని డెడికేషన్ ని కనబరుస్తున్నారు.
జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఈ వయసులో కూడా ఫ్యాన్స్ కి ఆదర్శంగా నిలిచారు. ఇక జిమ్ లో ఆ రేంజ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో వదలగా అది యిట్టె వైరల్ అయ్యిపోయింది. ఇక దీనితోనే మరో క్రేజీ అప్డేట్ ని మెగాస్టార్ అందించారు. దీనితో ఈ బ్లాస్టింగ్ ప్రాజెక్ట్ ఈ మే 21న ఆరంభం కానున్నట్టుగా క్రేజీ అప్డేట్ అందించారు. దీనితో ఈ మాసివ్ కాంబినేషన్ కోసం చూస్తున్న అభిమానులకి మన శంకర ప్రసాద్ గారు తనదైన శైలి లీక్ అందించారు అని చెప్పాలి.
