అభిమానికి అండగా నిలబడిన మెగాస్టార్ !

Published on Oct 24, 2021 7:36 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాని తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు పడుతున్నాడని తెలిసి తన సాయాన్ని అందించారు. విశాఖపట్నానికి చెందిన వెంకట్‌ అనే వ్యక్తి చిరంజీవికి అభిమాని. అయితే వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో వెంకట్ తన ఆరోగ్య పరిస్థితి గురించివివరిస్తూ మెగాస్టార్ ను కలవాలనుకుంటున్నాను అని ఓ ట్వీట్‌ పెట్టాడు.

కాగా వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి, వెంకట్‌ దంపతులను హైదరాబాద్‌ కు రప్పించి.. తన నివాసంలోనే చిరంజీవి వాళ్లను కలిసి మాట్లాడారు. వెంకట్‌ ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు చిరు. అలాగే వెంకట్ వైద్యానికి అవసరమైన ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని చిరు హామీ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌, వైజాగ్ లోని పలువురు డాక్టర్స్ తోనూ చిరు చర్చించారు.

సంబంధిత సమాచారం :

More