సమతా మూర్తి సన్నిధిలో మెగాస్టార్ చిరంజీవి..!

Published on Feb 13, 2022 9:00 am IST


ఇటీవల తెలంగాణా రాష్ట్రం ముచ్చింతల్ ఆశ్రమంలో సమతా మూర్తి శ్రీ రామానుజాచర్య భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొట్ట మొదటి సందర్శనతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా సమతా మూర్తి పేరు మరోసారి వినిపించగా..

అక్కడ నుంచి ఒక్కొక్కరిగా దేశ రాష్ట్ర ప్రముఖులు ఈ “స్టాచు ఆఫ్ ఈక్విటీ”(సమానత్వం తాలూకా ప్రతిమ స్థూపం) ని సందర్శించి సమతామూర్తి యొక్క గొప్పదనాన్ని దేశ సంస్కృతిని మరోసారి తెలియజేస్తున్నారు. మరి ఈ క్రమంలో పలువురు సినీ తారలు కూడా ఈ కార్యక్రమంలో పలు పంచుకుంటుండగా..

తాజాగా మన టాలీవుడ్ కి చెందిన దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లడం జరిగింది. సతీసమేతంగా నిరాడంబరంగా వెళ్లి మెగాస్టార్ సమతా మూర్తిని సందర్శించి ప్రసంగించారు. దీనితో మెగాస్టార్ రాకపై తన అద్భుత వ్యాఖ్యలపై అంతా ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :