బన్నీకి ఆ సినిమా పర్ఫెక్ట్..చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Apr 27, 2022 7:08 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా “పుష్ప” తో ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాడో తెలిసిందే. ఇక దీని తర్వాత రెండో సినిమాకి కూడా బన్నీ సిద్ధం అయ్యాడు. అయితే తన లైనప్ ని ఇలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్న ఐకాన్ స్టార్ పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది.

తన “ఆచార్య” ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ తో మాటల్లో తన సినిమాల్లో ఏ సినిమా ఫలానా హీరోకి సూట్ అవుతుంది అనే క్రమంలో తాను చేసిన చిత్రాల్లో “చంటబ్బాయ్” సినిమా అల్లు అర్జున్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని బన్నీ లో ఒక మిమిక్ ఉంటుంది తనైతే ఆ సినిమా కరెక్ట్ గా చేస్తాడని చిరు అల్లు అర్జున్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బన్నీకి చిరు అంటే ఎంత ప్రేమ, అభిమానం ఉన్నాయో ఎన్నోమార్లు చూపించాడు. మరి ఈ మాట బన్నీ వరకు వెళ్లిందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :