లేటెస్ట్ : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మెగాస్టార్

Published on Aug 2, 2022 12:30 am IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల్లో ముందుగా గాడ్ ఫాదర్ మూవీ రాబోయే దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకక్కుతున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఒక కీలక రోల్ చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీ పై ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక కీలక సాంగ్ ని చిరంజీవి, సల్మాన్ ల పై ముంబైలో ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించింది యూనిట్. ఇక ఆ సాంగ్ షూట్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి నేడు హైదారాబాద్ చేరుకున్నారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని పెద్ద సక్సెస్ కొడుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :