కైకాల సత్యనారాయణ ని కలిసి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి ….!!

Published on Jul 25, 2022 5:22 pm IST

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. తన కెరీర్ లో అనేక పాత్రలతో వందల సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించిన కైకాల మధ్యలో కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. చిరంజీవి హీరోగా చేసిన కొదమసింహం మూవీని నిర్మించిన కైకాల ఆ తరువాత నాగేశ్వరావు, జయసుధ నటించిన బంగారు కుటుంబం కూడా నిర్మించారు.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి మూవీలో చిన్న పాత్రలో కనిపించిన కైకాల ప్రస్తుతం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు ఇక నేడు ఆయన జన్మదినం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆయనని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి ఆయనతో కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం కైకాలని మెగాస్టార్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :