చిరు, త్రివిక్రమ్ ల కాంబినేషన్.. నిజమేనా ?

19th, October 2016 - 08:50:15 AM

chiru-trivikram
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తుండటంతో పరిశ్రమలో హడావుడి, కోలాహలం బాగా ఎక్కువయ్యాయి. ప్రేక్షకులు కూడా చిరంజీవి ఎలాంటి సినిమాలు చేస్తారో, పరిశ్రమలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోనని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం వినాయక్ డైరెక్షన్లో 150వ సినిమాగా ‘ఖైధీ నెం 150’ చిత్రంలో నటిస్తున్నారు చిరు. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజవుతుంది. కానీ ఇంతలోనే అభిమానుల్లో చిరు 151 వ, 152 వ సినిమాల గురించి ఆసక్తి మొదలైంది.

సినీ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్టుల పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చిరు తన 151 వ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తారని అంటున్నారు. అలాగే 152వ సినిమాపై కూడా తాజాగా ఓ న్యూస్ తెగ సందడి చేస్తోంది. అదేమంటే ఈ ప్రాజెక్టుని చిరంజీవి కెరీర్ బెస్ట్ హిట్ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నిర్మించిన నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తారట. అలాగే ఈ సినిమాని మాటల మాంత్రికుడు తివిక్రమ్ డైరెక్ చేస్తాడట. ఈ వార్తతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కానీ ఈ వార్తలు ఎంత వరకూ నిజమువుతా ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ అయినా అవొచ్చు. ఎందుకంటే అశ్వినీదత్, త్రివిక్రమ్ లు ఇద్దరూ మెగా ఫ్యామిలీకి మంచి సన్నిహితులే మరి.