క్రేజీ బజ్ : మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ రెండు మూవీస్ ఫిక్స్ ?

Published on May 6, 2023 8:56 pm IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని గ్రాండ్ లెవెల్లో క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భోళా శంకర్ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. అయితే విషయం ఏమిటంటే, దీని తరువాత మెగాస్టార్ తన కెరీర్ 156వ సినిమాని బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్నారట.

అలానే దాని అనంతరం 157వ సినిమాని ఇటీవల బింబిసార మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నారట. కాగా ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మెగాస్టార్ నటించనున్న నెక్స్ట్ ఈ రెండు క్రేజీ ప్రాజక్ట్స్ గురించిన న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో బజ్ గా మారింది. అయితే వీటి పై ఆయన సినిమాల యూనిట్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :