“కొండపొలం” సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు..!

Published on Oct 7, 2021 11:57 pm IST

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న అనగా రేపు విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి.

అయితే తాజాగా ఈ సినిమా ప్రీమియర్ చూసిన మెగస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. కొండపొలం సినిమా ఇప్పుడే చూశానని, పవర్‌ఫుల్ సందేశంతో కూడుకున్న అందమైన గ్రామీణ ప్రేమ కథ ఈ సినిమా అని, ఎప్పుడూ విభిన్న కథలను ఎంచుకుని, నటీనటుల నుంచి కూడా చక్కని ప్రదర్శనను రాబట్టగల్ సత్తా క్రిష్‌కి ఉందని, ఈ చిత్రం ఎంతో మంది ప్రశంసలు, ఎన్నో అవార్డులను గెలుస్తుందని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :