పవర్ఫుల్ & ఎమోషనల్ గా ‘రంగమార్తాండ’ మెగాస్టార్ షాయరి

పవర్ఫుల్ & ఎమోషనల్ గా ‘రంగమార్తాండ’ మెగాస్టార్ షాయరి

Published on Dec 21, 2022 11:24 PM IST


టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో షాయరి కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ అందించారు. కాగా కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ పలికిన ఈ షాయరిని యూట్యూబ్ లో విడుదల చేసారు మేకర్స్. నేనొక నటుడిని అంటూ హృదయానికి హత్తుకునేలా నటుల జీవితం గురించి ఎంతో గొప్పగా క్రియేటివ్ డైరెక్టర్ మదిలో మెదిలిన ఆలోచనకి అక్షర రూపం అందించారు లక్ష్మి భూపాల్.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఎంతో భావోద్వేగంతో అద్బుతంగా పలికిన ఈ షాయరికి ప్రస్తుతం అందరి నుండి మంచి ప్రసంశలు అందుతున్నాయి. ముఖ్యంగా ఈ షాయరిలో నేనొక నటుడ్ని, అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని, నవ్విస్తా, ఏడిపిస్తా, ఆప్తుడిని, దాసుడిని అంటూ పలికిన పదాలకు ఇళయరాజా నేపధ్య సంగీతం ఎంతో ఆకట్టుకుంది. మొత్తంగా రంగమార్తాండ కు మెగాస్టార్ అందించిన ఈ షాయరి అందరి మనసులు దోచుకోవడంతో పాటు సినిమా పై మంచి అంచనాలు కూడా ఏర్పరిచింది. మరాఠీ మూవీ నటసామ్రాట్ కు రీమేక్ గా రూపొందుతున్న రంగమార్తాండ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు