“RRR” సినిమాపై మెగాస్టార్ ఎగ్జైటింగ్ రెస్పాన్స్.!

“RRR” సినిమాపై మెగాస్టార్ ఎగ్జైటింగ్ రెస్పాన్స్.!

Published on Mar 25, 2022 7:30 PM IST

మన టాలీవుడ్ కి చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తుంది.

మరి ఈ సినిమా విజయంతో అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై తమ స్పందనను తెలియజేస్తుండగా లేటెస్ట్ గా టాలీవుడ్ లెజెండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి తన స్పందనను తెలిపారు.

ఈ చిత్రం మాస్టర్ స్టోరీ టెల్లర్స్ కి ఒక మాస్టర్ పీస్ లాంటిది అని అలాగే రాజమౌళి అసాధారణ సినిమాటిక్ విజన్ కి ఈ చిత్రం ఒక మైండ్ బ్లోయింగ్ సాక్ష్యం లాంటిది అని మెగాస్టార్ తెలిపారు.

అలా తెలిపి టోటల్ సినిమా యూనిట్ కి తన హ్యాట్సాఫ్ తెలుపుతున్నానని మెగాస్టార్ తెలిపారు. దీనితో మెగాస్టార్ ఈ క్రేజీ రెస్పాన్స్ ఓ రేంజ్ లో అభిమానులకు కిక్ ఇస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు