తొలి రెబల్ స్టార్ కృష్ణంరాజు కి మెగాస్టార్ ప్రత్యేక శుభాకాంక్షలు.!

Published on Jan 20, 2022 6:09 pm IST


టాలీవుడ్ లెజెండరీ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు పుట్టిన రోజు కావడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు సహా దర్శక నిర్మాతలు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరి ఇప్పుడు లేటెస్ట్ గా మరో దిగ్గజ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కృష్ణం రాజు గారికి తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.

తనకి సోదర సమానులు టాలీవుడ్ లో తొలి రెబల్ స్టార్ నిర్మాతగా రాజకీయ నాయకునిగా అలాగే కేంద్ర మంత్రిగా కూడా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణం రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని చిరు తెలిపారు. మరి ప్రస్తుతం మెగాస్టార్ పలు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండగా రెబల్ స్టార్ నటించిన చిత్రం “రాధే శ్యామ్” రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :