కృష్ణవంశీకి మెగాస్టార్ ఎందుకు ఫోన్ చేసినట్టు ?

21st, August 2016 - 05:45:26 PM

Chiranjeevi-serious-on-Dire
ప్రస్తుతం పరిశ్రమలో ఎక్కడ చూసినా చిరంజీవి 150వ చిత్రం గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. రేపు చిరు పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తుండటం, సినిమాకి ‘ఖైదీ నెం.150’ అని టైటిల్ కన్ఫర్మ్ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. చిరంజీవికి సంబందించిన ఏ చిన్న వార్త బయటకొచ్చిన హడావుడి అయిపోతోంది. ఇలాంటి సందర్భంలో చిరంజీవి దర్శకుడు కృష్ణవంశీకి ఫోన్ చేసినట్టు వార్తలోస్తున్నాయి.

ఈ ఫోన్ కాల్ సారాంశమేమిటంటే కృష్ణవంశీ చేస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో ధరమ్ తేజ్ నటిస్తుండటంతో అసలు తేజ్ చేస్తున్న పాత్రేమిటి, సినిమా కథ ఏమిటి అనేది తెలుసుకోవడానికి చిరు ఫోన్ చేశారని, వంశీ చెప్పిన కథ నచ్చి, మెచ్చుకున్నారని తెలుస్తోంది. స్వయంగా చిరంజీవే ఫోన్ చేయడం, కథ బాగుందని మెచ్చుకోవడంతో కొన్నాళ్లుగా ఎదురు దెబ్బలతో డీలా పడ్డ కృష్ణవంశీకి కొత్త ఉత్సాహం వచ్చినట్లుందట పైగా సినిమా విజయంపై కూడా ధీమా పెరిగిందట.