ఈ కీలక అంశంలో సీఎం కేసీఆర్ కి మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞ్యతలు.!

Published on Dec 25, 2021 11:32 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆల్రెడీ “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా కంప్లీట్ చేసేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు మరిన్ని సినిమాలు ఏకకాలంలో చిరు కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరోపక్క సినిమా పరిశ్రమలో అనేక ఇబ్బందులు లేవనెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో టికెట్ ధరలు విషయంలో పెద్ద రచ్చే నడుస్తుంది.

కానీ ఇంకో పక్క తెలుగు చిత్ర పరిశ్రమకి మాత్రం తెలంగాణా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టుగా ప్రకటించి తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల టాలీవుడ్ వారు హర్షం వ్యక్తం చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో తీసుకున్న నిర్ణయానికి గాను చిరు తన కృతజ్ఞ్యతలు తెలియజేసారు.

“తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. అని చిరు తెలిపారు.

సంబంధిత సమాచారం :