మెగాస్టార్ మెగాప్లానింగ్ … రెండు ఏకంగా మూడు …!!

Published on Jul 7, 2022 2:00 am IST

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా కుమారుడు రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన మూవీ ఆచార్య. ఇక ప్రస్తుతం ఆయన మొత్తం మూడు సినిమాలు చేస్తున్నారు. ముందుగా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ లో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు మెగాస్టార్. మొన్న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. మోహన్ రాజా తీస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్. ఇక ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

తరువాత యువ దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేస్తున్న 154వ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ ఊర మాస్ రోల్ చేస్తుండగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. అయితే ముందుగా ఈ రెండు పండుగలకు రెండు మూవీస్ రిలీజ్ ప్లాన్ చేశారట. ఇక మెహర్ రమేష్ తో మెగాస్టార్ చేస్తున్న మూవీ భోళా శంకర్. తమిళ మూవీ వేదాళం కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలిగా కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట. మొత్తంగా దీనిని బట్టి చూస్తే దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు తన ఫ్యాన్స్ ని వరుసగా ఖుషి చేయనున్నారు మెగాస్టార్.

సంబంధిత సమాచారం :