మోహన్ బాబు కోసం మెగాస్టార్ చిరంజీవి !

mohan-babu-chiru
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా 17వ తేదీన వైజాగ్ లోని మున్సిపల్ స్టేడియంలో భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నిర్మాత, రాజకీయవేత్త అయిన టి. సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో ‘లలితా కళా పరిషత్’ మోహన్ బాబును ‘నవరస నట తిలకం’ పురస్కారంతో సత్కరించనుంది. ఈ వేడుకకు దాసరి, నాగార్జున, వెంకటేష్, సుమలత, శ్రీదేవి, జయసుధ వంటి నటులతో పాటు బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా కూడా హాజరుకానున్నారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఖైదీ నెం. 150’ షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు తీరికలేకపోయినా మోహన్ బాబుతో ఉన్న సన్నిహిత్యం రీత్యా వీలు చూసుకుని మరీ వేడుకకు హాజరవుతున్నారట. ఇకపోతే ఇప్పటికే వైజాగ్ చేరుకున్న మోహన్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ తన ఈ సుదీర్ఘ ప్రయాణానికి కారకులైన ఆయన గురువు దాసరి నారాయణరావుకు, తన అభిమానులకు కృతఙ్ఞతలు తెలిపారు.