టైగర్ హిల్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి

టైగర్ హిల్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి

Published on Nov 9, 2021 5:00 PM IST


కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో అలరిస్తున్న కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ‘ప్రొడక్షన్ నెంబర్ 1’గా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూర్ ముఖ్యపాత్ర పోశిస్తుండగా, సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు తాజాగా మెగా సపోర్ట్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది.

ఇకపోతే ఈ సినిమాకు సంగీత దిగ్గజం మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుందని దర్శకనిర్మాతలు అంటున్నారు. తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, చిత్రంలో రాజీవ్ సాలూర్ నటన హైలైట్ కానుందని నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి) అన్నారు. రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ మధ్య కెమిస్ట్రీ నేటితరం ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ కె అచల మాటలు అందిస్తున్నారు. విష్ణుసూర్య గుంత ఎక్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు