వైరల్ పిక్స్ : స్టైలిష్ ట్రెండీ స్టైల్ లుక్ లో అదరగొట్టిన మెగాస్టార్

Published on Jan 28, 2023 2:40 am IST


టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేసిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా యువ దర్శకుడు బాబీ కొల్లి దీనిని మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇక లేటెస్ట్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు మెగాస్టార్.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్న మెగాస్టార్, అటు తన సినిమాల్లోని క్యారెక్టర్స్ కోసం ఎప్పటికప్పుడు సరికొత్తగా మెకోవర్స్ తో సిద్ధం అవుతున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య లో మాస్ అవతార్ లో దర్శనమిచ్చిన మెగాస్టార్, త్వరలో భోళా శంకర్ లో ఆకట్టుకునే స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఇటీవల మెగాస్టార్ ఒక స్టైలిష్ ట్రెండీ లుక్ లో దిగిన స్పెషల్ ఫోటోషూట్ పిక్స్ మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా మెగాస్టార్ ఇప్పటికీ ఇంకా యంగ్ గానే కనపడుతున్నారని పలువురు ప్రేక్షకాభిమానులు ఈ పిక్స్ చూసి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :