కార్తికేయ ‘రాజా విక్రమార్క’ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన మెగస్టార్..!

Published on Nov 12, 2021 1:30 am IST

యంగ్ హీరో కార్తికేయ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి. టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న ఈ సినిమా గ్రాండ్‌గా కాబోతుంది.

అయితే మంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమాకి మెగస్టార్ చిరంజీవి బూస్టఫ్ ఇచ్చేలా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా తమ కష్టాన్ని నమ్ముకుని పరిశ్రమలో తమ ఉనికిని చాటుకునే నటీనటులను తాను మెచ్చుకుంటానని, యంగ్ హీరో కార్తికేయలో కూడా అలాంటి ప్రతిభనే ఉందని మరియు అతనిపై నాకు సోదర ప్రేమ ఉంది. కార్తికేయ నాకు ఇష్టమైన సినిమాల్లో ఒకటైన రాజా విక్రమార్క అనే టైటిల్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. నేను ట్రైలర్‌ని చూశానని, మరియు అవి థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :