ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము – మెగాస్టార్ చిరంజీవి

Published on Feb 10, 2022 7:57 pm IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో భేటీ అనంతరం టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం, సీఎం తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కల్పిస్తాం అని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారికి చెప్పడం జరిగింది. ఈరోజు సహృద్భావంగా ఈ చర్చ ముగిసింది. దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. హోప్ ఫుల్లీ ఈ నెల మూడవ వారం లోపల జీవో వచ్చే అవకాశం ఉంది. ఎంత తొందరగా జీవో వస్తే అంత తొందరగా సినీ పరిశ్రమ ముందుకు వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :