కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు – మెగాస్టార్ చిరంజీవి

Published on Sep 22, 2021 2:50 pm IST


మెగాస్టార్ చిరంజీవి నటుడు గా తన ప్రస్థానం ను మొదలు పెట్టి నేటికీ 43 ఏళ్లు అవుతుంది. ఈ మేరకు అభిమానులు, సినీ పరిశ్రమ చెందిన వారు మెగాస్టార్ చిరంజీవి కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నటుడు గా నేడు అరంగేట్రం అవ్వడం పట్ల భావోద్వేగం తో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆగస్ట్ 22 వ తేదీన నేను పుట్టిన రోజు అయితే, సెప్టెంబర్ 22 నటుడు గా పుట్టిన రోజు అంటూ చెప్పుకొచ్చారు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు అంటూ తెలిపారు. మీ అందరికీ నన్ను నటుడిగా పరిచయం చేసి, మీ ఆశీస్సులు పొందిన రోజు, నేను మరిచిపోలేని రోజు అని అన్నారు.

సంబంధిత సమాచారం :