మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

Published on May 21, 2023 8:42 pm IST

ప్రముఖ సంగీత దర్శకత్వ ద్వయం రాజ్ – కోటి లో రాజ్ ఈరోజు మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మ్యూజిక్ కంపోజర్ కోటితో పాటు ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చారు రాజ్. మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్‌లో ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్ – కోటి లలో రాజ్ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్, నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి! అంటూ చెప్పుకొచ్చారు.

యముడికి మొగుడు, ఖైదీ నెం. 786, కొదమ సింహం, లంకేశ్వరుడు, రాజా విక్రమార్క, ముఠా మేస్త్రీ, మెకానిక్ అల్లుడు వంటి ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్‌లను రాజ్ – కోటి చిరుకు అందించారు. సంగీత దర్శకుడి అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

సంబంధిత సమాచారం :