ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశా – మెగాస్టార్ చిరంజీవి

Published on Nov 30, 2021 1:02 am IST


సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, నరేష్, తులసి ప్రధాన పాత్రల్లో మహేష్ ఉప్పాల దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నీహారిక నిర్మించడం జరిగింది. జీ 5 లో ప్రస్తుతం ఈ సీరీస్ స్ట్రీమ్ అవుతుంది. తాజాగా ఈ సీరీస్ పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ను చూశాను, ఎంతో ఎంటర్ టైనింగ్ గా ఉంది, నిర్మాణం లో తన తొలి ప్రయత్నం లోనే, ఇంత హృద్యం గా, వినోదాత్మకంగా తీసి ప్రేక్షకులని మెప్పిస్తున్న కొణిదెల వారి ఆడబడుచు కి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీమ్ కి అభినందనలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. మీరిచ్చిన ఈ స్ఫూర్తి తో తను మరిన్ని జనరంజకమైన చిత్రాలను నిర్మించాలని కోరుకుంటూ, కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెస్ నిహ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఇప్పటి వరకూ 6 కోట్ల మినిట్స్ వ్యూస్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :