పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట రాలేదు – మెగాస్టార్ చిరంజీవి

పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట రాలేదు – మెగాస్టార్ చిరంజీవి

Published on Oct 29, 2021 3:02 PM IST

కన్నడ సినీ పరిశ్రమ ఒక స్టార్ హీరోను కోల్పోయింది. శుక్రవారం నాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ గుండె పోటు కారణంగా మరణించారు. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో బెంగళూరు లోని విక్రమ్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ వెంటి లేటర్ పై ఆయన చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. పునీత్ మృతికి కేవలం కన్నడ సినీ పరిశ్రమ నుండి మాత్రమే కాక తెలుగు, తమిళ, మలయాళ, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ మృతి పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.”ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. పునీత్ రాజ్ కుమార్ గారి మరణం కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రావడం లేదు” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

29 సినిమాల్లో హీరోగా నటించిన పునీత్ రాజ్ కుమార్ మరణం తో అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. కన్నడ సినీ పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది అంటూ ప్రముఖులు, అభిమానులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు