తిరుమల తిరుపతి లో పడుతున్న వర్షాల పై చిరు కీలక వ్యాఖ్యలు!

Published on Nov 19, 2021 12:57 pm IST


మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తులు మరియు స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన మనసును కలచి వేశాయి అని వ్యాఖ్యానించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం లు కలిసి కట్టుగా కృషి చేసి, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెల కొల్పాలి అని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలు మరియు తన అభిమాన సంఘాలు సైతం చేయుట నివ్వాల్సింది గా కోరుతున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

సంబంధిత సమాచారం :

More