రామ్ చరణ్ – శంకర్ ప్రాజెక్ట్ పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

Published on Sep 8, 2021 3:00 pm IST

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో సినిమా కి నేడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ RC 15 మొదలు కావడంతో సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు టీమ్ కి విషెస్ తెలుపుతున్నారు. ఈ మేరకు రామ్ చరణ్ మరియు శంకర్ ల ప్రాజెక్ట్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొన్ని ప్రాజెక్ట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి అని అన్నారు. అందులో ఇది ఒకటి అంటూ చెప్పుకొచ్చారు. శంకర్ తో కలిసి పని చేయడం ఒక డ్రీమ్ అని, అది రామ్ చరణ్ ద్వారా ఇప్పుడు తీరబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. వారి సినిమా ఈరోజు ప్రారంభం అయింది అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న కియరా అద్వానీ కి, నిర్మాత దిల్ రాజు గారికి, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కి, టీమ్ అందరికీ వెరీ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :