శబరిమల దర్శనం పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

Published on Feb 13, 2022 4:38 pm IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా శబరిమల దర్శనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మెగాస్టార్.

చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది అని, అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణం గా, అందరినీ అసౌకర్యం కి గురి చేయకుండా, డోలి లో వెళ్ళవలసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి అని వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణం లో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాల తోడు మంచి అనుభూతి ను ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ విషయం తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి అక్కడి పలు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :