మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ – మెగాస్టార్ చిరంజీవి

Published on Nov 5, 2021 10:51 pm IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్ ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కోలుకున్న సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటో ఒకటి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. ఫోటో ను షేర్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు అని వ్యాఖ్యానించారు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఫోటో లో మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా నాగబాబు, పవన్ కళ్యాణ్ లు, రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అఖిరా, పంజా వైష్ణవ్ తేజ్ లు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియా వేదిక గా సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నా పునర్జన్మ కి కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్థన లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అన్నారు.మీ ప్రేమ పొందడం నా పూర్వ జన్మ సుకృతం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More