వరుణ్ “గని” ట్రాన్స్ఫర్మేషన్ పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

Published on Nov 17, 2021 11:35 am IST


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ట్రాన్స్ ఫామ్ అయిన విధానం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించడం జరిగింది. ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ వరుణ్ అంటూ చెప్పుకొచ్చారు. ఒక పాత్ర కోసం తాను చేసిన హార్డ్ వర్క్ మరియు ప్యాషన్ ఎంటి అనేది తెలుస్తుంది అని అన్నారు. చిత్ర యూనిట్ కి మరియు వరుణ్ తేజ్ కి ఈ గని సినిమా విజయం సాధించాలి అని వరుణ్ తేజ్ తెలిపారు.

సంబంధిత సమాచారం :