“వాల్తేరు వీరయ్య” సినిమా చూసి మెగాస్టార్ ఏమన్నారంటే?

“వాల్తేరు వీరయ్య” సినిమా చూసి మెగాస్టార్ ఏమన్నారంటే?

Published on Dec 25, 2022 10:04 PM IST


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మరియు రెండు పాటలు ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. జనవరి 13, 2023న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అభిమానుల సమావేశంలో చిత్ర దర్శకుడు బాబీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చిరంజీవి రెండు రోజుల క్రితమే సినిమా చూశారని, సినిమా డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారని ఆయన వెల్లడించారు. మొదటి నుంచి బాబీ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు