దయచేసి ఈ విషయమై పునరాలోచించండి… సీఎం జగన్ కి మెగాస్టార్ చిరు విజ్ఞప్తి!

Published on Nov 25, 2021 2:00 pm IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టికెట్ల ధరల అంశం పై మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం అని వ్యాఖ్యానించారు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు దెరువు కోసం, తగ్గించిన టికెట్స్ రేట్స్ ను కాలానుగుణంగా, సముచితం గా దేశం లోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమ కి మేలు జరుగుతుంది అని తెలిపారు. దేశమంతా ఒకటే జీఎస్టీ గా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం అని అన్నారు. దయచేసి ఈ విషయమై పునరాలోచన చేయాలని సీఎం జగన్ ను విన్నవించారు. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పలువురు స్పందిస్తున్నారు. ఈ విషయం పై సీఎం జగన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :