ఒక హీరోగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు మరియు దక్షిణాది ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే హీరోగా కంటే కూడా ఒక వ్యక్తిగా మెగాస్టార్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. అలాగే అలాంటి కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ ముందుండి నడిపించడానికి రెడీగా ఉంటారు.
అలా ఇటీవలే నెలకొన్న పరిస్థితుల రీత్యా సినీ కార్మికులకు కూడా అండగా నిలిచారు. అంతే కాకుండా తన బ్లడ్ బ్యాంకు ద్వారా ప్లాస్మా దానం చెయ్యాలి అని పిలుపును కూడా ఇచ్చారు. అయితే ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేసారు.
ఈ విషయంపై తమ్ముడు చేసిన పనికి అన్నయ్యగా మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. కరోనాతో పోరాడి గెలవడమే కాకుండా ఇతరులను కాపాడేందుకు ముందుకొచ్చిన అభినందనలు అని ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న వారు అంతా ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు రావాలి అని మరోమారు విన్నపిస్తున్నానని చిరూ చిరు విజ్ఞ్యప్తి చేసారు.
covid 19 తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, CCTలో plasma donate చేసిన తమ్ముడు @NagaBabuOffl కి అభినందనలు????????ఈ సందర్భంగా covid నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు plasma donate చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.దయచేసి ముందుకు రండి.???? #DonatePlasma pic.twitter.com/L8nUPJPinc
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2020
