బ్యూటిఫుల్ పిక్ తో రామ్ చరణ్ కి మెగాస్టార్ బర్త్ డే విషెస్!

Published on Mar 27, 2023 12:04 pm IST


గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో దూసుకు పోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఈ స్టార్ హీరో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం తో అభిమానులు, సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు.

నిన్ను చూస్తే గర్వం గా ఉంది నాన్న, హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. విషెస్ తో పాటుగా ఒక బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేశారు. రామ్ చరణ్ ను ముద్దు పెడుతూ ఉన్న ఫోటో అది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న నెక్స్ట్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి మేకర్స్ గేమ్ చేంజర్ అని టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :