మంచు విష్ణు కి మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్..!

Published on Oct 10, 2021 11:37 pm IST

మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ పై దాదాపు వంద ఓట్ల తేడా తో మంచు విష్ణు గెలుపొందారు. మా కి కొత్త ప్రెసిడెంట్ గా గెలవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన అధ్యక్షడు మంచు విష్ణు కు మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కి కంగ్రాట్స్ తెలిపారు. అంతేకాక ఈ ఎన్నికలో గెలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటు పడుతుంది అని ఆశిస్తున్నా అని అన్నారు.మా ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం, ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తి తోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను అని అన్నారు.

సంబంధిత సమాచారం :