“ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరు!

“ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరు!

Published on Feb 24, 2024 5:04 PM IST

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుల్వామా ఉగ్రదాడి ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తోంది. ప్రమోషన్స్‌తో దూసుకుపోతున్న వరుణ్ తేజ్, తన సినిమాను మార్కెట్ చేస్తున్న తీరుకు సాలిడ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. రేపు హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు.

మెగాస్టార్ రాకతో సినిమా పై మరింత పాజిటివ్ బజ్ నెలకొంది. పబ్లిసిటీకి సంబంధించి టీమ్ అన్ని సరైన ఎత్తుగడలను చేస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు