మహేష్ ఆరోగ్యం విషయంలో మెగాస్టార్ ఆసక్తికర పోస్ట్.!

Published on Jan 7, 2022 1:28 pm IST

ప్రస్తుతం మళ్ళీ దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ తారలు కరోనా బారిన పడి పాజిటివ్ గా నిర్ధారణ అవుతుండడం వారి అభిమానులని మరింత కలవర పెడుతుంది. అయితే నిన్ననే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్టు ఊహించని విధంగా షాకింగ్ వార్తను పంచుకోవడంతో అంతా ఆందోళనకు లోనయ్యారు.

మరి ఈ సందర్భంలోనే టాలీవుడ్ ఇతర సినీ తారలు కూడా మహేష్ ఆరోగ్యం పట్ల ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అలా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆసక్తికర పోస్ట్ ని మహేష్ విషయంలో పెట్టారు. మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అలాగే మళ్ళీ మహేష్ నిన్ను యాక్షన్ మోడ్ లో చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చిరు మహేష్ కి ఉత్సాహభరిత రికవరీ విషెష్ ని తెలియజేసారు.

సంబంధిత సమాచారం :