షూటింగ్ షురూ చేసిన మెగాస్టార్…హైదరాబాద్ లో!

Published on Feb 6, 2022 5:42 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణం గా సినిమా షూటింగ్ లకు విరామం చెప్పారు. తాజాగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు.

హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ షూటింగ్ లో నేడు మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం లో నయనతార, శ్రియ శరణ్, సత్యదేవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని NVR సినిమా ఎల్ ఎల్ పి మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపనీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :