చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు – మెగాస్టార్ చిరంజీవి

Published on May 28, 2023 3:20 pm IST

స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆయన శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదిక గా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నూటికో కోటికో ఒక్కరు, వందేళ్లు కాదు, చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :