మరో గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ స్టోరీ తో వస్తున్న సత్యదేవ్…గాడ్సే టీజర్ ను రిలీజ్ చేసిన మెగాస్టార్

Published on Dec 20, 2021 2:00 pm IST

సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గాడ్సే. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం గా ఉండే సత్యదేవ్, మరొకసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు రానున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ విడుదల అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.

టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఇంటెన్స్ డ్రామా తో కూడుకున్నట్లు టీజర్ ను చూస్తే తెలుస్తుంది. పొలిటికల్ టచ్ తో కూడుకున్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే విధంగా ఉండటం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సీకే స్క్రీన్స్ పతాకం పై సీ. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, నాగబాబు కొణిదెల, సిజ్జు మీనన్, వర్ఘెసే, పృథ్వీ రాజ్, నోయల్ సీన్, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, పవన్ సంతోష్, గురు చరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :