సత్యదేవ్ “గాడ్సే” టీజర్ ను రిలీజ్ చేయనున్న మెగాస్టార్!

Published on Dec 19, 2021 8:43 pm IST

హీరో సత్యదేవ్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గాడ్సే. ఈ చిత్రం ను సీకే స్క్రీన్స్ పతాకం పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సత్యదేవ్ మరింత పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ను టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టీజర్ ను రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :