సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్న మెగాస్టార్!

Published on Sep 21, 2021 12:28 pm IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం ను అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం చిత్ర యూనిట్ షురూ చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం ట్రైలర్ ను టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 22 వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :