మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్

Published on Jan 26, 2022 10:05 am IST

మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయం గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నిన్న రాత్రి స్వల్ప లక్షణాలతో కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

అయితే గత కొన్ని రోజులుగా తనను సంప్రదించిన వారందరూ కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని అభ్యర్ధించారు. త్వరలో మీ అందరినీ చూడటానికి వేచి ఉండలేను అంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :