బ్రహ్మాస్త్ర కి మెగాస్టార్ చిరు వాయిస్ ఓవర్

బ్రహ్మాస్త్ర కి మెగాస్టార్ చిరు వాయిస్ ఓవర్

Published on Jun 13, 2022 2:00 PM IST


బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో ముందడుగు వేసి బ్రహ్మస్త్రం సినిమాకి వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు అతనే శివ అని మెగాస్టార్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే ట్రైలర్ జూన్ 15 న 5 భాషల్లో విడుదలకానుంది.

ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నా మేకర్స్. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9, 2022 న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు