సీటీమార్ చిత్రం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నా – మెగాస్టార్ చిరంజీవి

Published on Sep 6, 2021 11:50 am IST


గోపీచంద్ హీరోగా తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన చిత్రం సీటి మార్. ఈ చిత్రం కబడ్డీ ఆట నేపథ్యం లో కొనసాగనుంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అయి విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు సంపత్ నంది ను, మరియు చిత్ర యూనిట్ ను అభినందిస్తూ, చిత్ర విజయం సాధించాలి అంటూ చెప్పుకొచ్చారు.

ట్రైలర్ చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీటిమార్ ట్రైలర్ ఇప్పుడే చూడటం జరిగింది అని, గ్రామీణ క్రీడా కబడ్డీ నేపథ్యం లో ఈ చిత్రం తెరకెక్కింది అని, సంపత్ నంది రచ్చ సినిమా టైమ్ నుండి తనకు తెలుసు అని, మంచి కథకుడు, బాగా నెరేట్ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. తన నేరేషన్ చూసే రచ్చ టైమ్ లో ఫిదా అయినట్లు తెలిపారు. అప్పటి నుండి సంపత్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నేడు చక్కని కథాంశం తో తెరెక్కించినట్లు తెలిపారు. ఈ చిత్రానికి పవన్ కుమార్, శ్రీనివాస్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. మణిశర్మ సంగీతం అందించారు అని అన్నారు. ఈ మేరకు చిత్రం విజయం సాధించాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 వ తేదీన థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :