భారీ సెట్ లో “భోళా శంకర్” షూటింగ్ ప్రారంభం!

Published on Nov 15, 2021 7:29 pm IST


మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామబ్రహ్మం సుంకర నిర్మాణం లో భోళా శంకర్ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్ లో ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ వేసిన భారీ సెట్ లో ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రం ను ప్రకటించినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాఖీ స్పెషల్ వీడియో కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ను డిఫెరెంట్ గెటప్ లో మెహర్ రమేష్ చూపించనున్నారు.

ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తుండగా, కీర్తీ సురేష్ సోదరి పాత్రలో నటిస్తుంది. రఘుబాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్ల లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More