మెగాస్టార్ “గాడ్ ఫాదర్” క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే!

మెగాస్టార్ “గాడ్ ఫాదర్” క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే!

Published on Nov 23, 2022 6:06 PM IST


మెగాస్టార్ చిరంజీవి చివరిగా కనిపించిన చిత్రం గాడ్‌ఫాదర్‌. ఈ చిత్రం ఎంతైనా క్లిక్‌ కావాల్సిన సినిమా. ఆచార్య పరాజయం తర్వాత ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంతో మెగాస్టార్ తన సత్తా నిరూపించుకోవాల్సి వచ్చింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు లాంగ్ రన్‌లో 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన లూసిఫర్‌కి అధికారిక రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ స్పెషల్ పాత్రలో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, చిరు సోదరిగా స్టార్ హీరోయిన్ నయనతార నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు