మెగాస్టార్ “గాడ్ ఫాదర్” ఫస్ట్ లుక్ కి సర్వం సిద్ధం!

Published on Jul 1, 2022 8:24 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్ గాడ్ ఫాదర్. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ చిత్రానికి ఇది అధికార రీమేక్. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లపై ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల పై చిత్ర యూనిట్ తాజాగా సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ ను జూలై 4, 2022 న సాయంత్రం 5:45 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :