మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” నుండి ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్!

మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” నుండి ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్!

Published on Nov 20, 2022 4:25 PM IST

మెగాస్టార్ చిరంజీవి 2023 సంక్రాంతికి విడుదల కానున్న వాల్తేరు వీరయ్య చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ నవంబర్ 23న సాయంత్రం 04:05 గంటలకు విడుదల కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఈ విషయాన్ని తెలిపేందుకు మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరు చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు, మెగాస్టార్ డ్యాన్స్ మూవ్‌లను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు చిరుకి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు