మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Nov 13, 2022 6:20 PM IST


డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య. అభిమానులకు, ప్రేక్షకులకు పూనకాలు అందించబోతున్నారు మేకర్స్. టైటిల్ టీజర్ మాస్ ఆడియెన్స్ కి కొన్ని హై మూమెంట్స్ ఇచ్చింది.

మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో వచ్చారు. వాల్తేరు వీరయ్య మొదటి సింగిల్ ఈ వారం విడుదల అవుతుంది అని పేర్కొన్నారు. ఫస్ట్ సింగిల్ చూసాను, బాస్ మాస్ డాన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇది చిరంజీవి, ఊర్వశి రౌతేల పై ప్రత్యేక గీతం. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా క్రాంక్ చేయగా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ మరియు ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు